WTC Final: ఆస్ట్రేలియా కష్టమేనా? అయితే సౌతాఫ్రికాను ఢీ కొట్టేది?

praveen
WTC (ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్) ఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడడం ఖాయంగా కనబడుతున్నప్పటికీ శ్రీలంక జట్టుకి ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఎంతమాత్రమూ లేదు అని స్టేట్మెంట్ ఇవ్వలేము. ఎందుకంటే, కొమ్ములు తిరిగిన ఆస్ట్రేలియా కూడా కుదేలవుతుందేమో వేచి చూడాలి. అయితే దానికి ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 69.44% మార్కులతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 63.73%తో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండు జట్లు ఫైనల్స్‌కు అర్హత ఆల్రెడీ సాధించేశాయి.
అయితే, ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ మ్యాచ్ లు ఇక్కడితో ముగిసిపోయాయి. అంటే, ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. శ్రీలంక 2-0తో సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా స్కోరు 57.02 శాతానికి పడిపోక తప్పదు. అలా కాకుండా ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు పెద్ద పొరపాటు చేస్తే గనుక స్లో ఓవర్ రేట్ నమోదు అవుతుంది. శ్రీలంకతో జరిగే 2 టెస్టు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ మిస్టేక్ చేస్తే ఆస్ట్రేలియా కనీసం 8 పాయింట్లు కోల్పోతుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు పర్సంటేజీ పాయింట్లలో మార్పు, వ్యత్యాసం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే, ఆస్ట్రేలియా జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి 2 స్లో ఓవర్ రేట్ తప్పిదాలు చేస్తే, శ్రీలంక ఆస్ట్రేలియా జట్టును అధిగమించి ఫైనల్‌కు అర్హత పొందవచ్చన్నమాట.
అయితే దానికి పెద్దగా స్కోప్ లేనప్పటికీ, ఒక్కసారి టెస్టు క్రికెట్‌లో ఇలాంటి పొరపాట్లు జరిగాయా? అని చెక్ చేసుకుంటే... కచ్చితంగా జరిగాయనే చెప్పుకోవచ్చు. 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ మొత్తం 19 పాయింట్లు కోల్పోగా... 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. అలాగే, స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు 10 పాయింట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలా అదృష్టం చేతికి వస్తే శ్రీలంక జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చని క్రికెట్ పండింతులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

wtc

సంబంధిత వార్తలు: