ఐపీఎల్ వేలంలో.. అంత ధరకు నేను అర్హుడినే.. చాహల్ కామెంట్స్ వైరల్?

frame ఐపీఎల్ వేలంలో.. అంత ధరకు నేను అర్హుడినే.. చాహల్ కామెంట్స్ వైరల్?

praveen

తాజాగా ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లు సత్తాను చాటారు. మునుపుటి కంటే కూడా ఈసారి రికార్డు స్థాయిలో ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయారు. ఫ్రాంచైజీలు ఎక్కువగా పోటీ పడడంతో అంత మొత్తం ధరలకు అమ్ముడుపోయినట్టు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్నాళ్ల నుండి జాతీయ జట్టుకి దూరంగా ఉంటున్న టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీ పడ్డాయి. దాంతో ఆఖరికి ఆయనని 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఇది చాహల్ కి అత్యంత పెద్ద మొత్తం అనే కామెంట్లు వస్తున్న తరుణంలో ఈ క్రీడాకారుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చాలా ఆసక్తికరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
గత ఐపీఎల్ వేలంలో ఇతగాడిని రాజస్థాన్ కేవలం 6 కోట్లకే సొంతం చేసుకుంది. దానికి ఇప్పుడు మూడంతలు తీసుకోవడం సర్వత్ర చర్చనీయాంసం కావడంతో చాహల్ ఈ విధంగా స్పందించాడు. ఈ విషయమై ఓ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ... వేలం జరుగుతున్న సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. ఎంత భారీ మొత్తం వస్తుందని అస్సలు ఊహించలేదు. గడిచిన మూడు ఐపీఎల్ వేలాలతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పుకోవచ్చు. ఆ మూడు వేళాలు కలిపితే ఎంత భారీ మొత్తం అవుతుందో ఈసారి అంత పెద్ద మొత్తం నాకోసం వెచ్చించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. అయితే ఒక నైపుణ్యం కలిగిన క్రీడాకారుడిగా దానికి నేను అర్హుడననే అనుకుంటున్నాను. నేనైతే మాత్రం వ్యక్తిగతంగా 12 కోట్ల నుండి 13 కోట్ల వరకు వస్తాయేమో అనుకున్నాను. నన్ను పంజాబ్ కింగ్స్ కొంటుందని చాలామంది భావించారు. కానీ అందరికీ భిన్నంగా పంజాబ్ నన్ను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు లాగానే నాలో మీరు ఓ సరికొత్త ఆటగాడిని చూడగలుగుతారని ఈ సందర్భంగా చెబుతున్నాను! అంటూ స్పందించాడు.
ఈ వ్యాఖ్యలు విన్న సోషల్ మీడియా జనాలు చాహల్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. ఇక అతను అభిమానులైతే పండగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆయన మాట్లాడుతూ... పంజాబ్ టీం కోచ్ రికీ పాంటింగ్ గురించి చెప్పుకు రావడం జరిగింది. రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆ క్షణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని చెప్పుకు రావడం గమనార్హం. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ తో తనకు మంచి సంబంధం ఉందని, కలిసికట్టుగా ఆడి సత్తా చాటుతానని, 100% శ్రమించి తన టీం కి మంచి పేరు తీసుకొస్తానని కామెంట్స్ చేశాడు. ఇకపోతే ఐపీఎల్ చరిత్రలో 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన క్రీడాకారుడుగా చాహల్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది. దీనిని ఇప్పటివరకు మరే క్రీడాకారుడు కూడా బ్రేక్ చేయకపోవడం విశేషం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: