ఆరోజు సచిన్ పక్కటెముకలు విరిగిపోయాయి.. షాకింగ్ విషయం చెప్పిన గంగూలీ?
ఇక సచిన్ టెండూల్కర్ కెరియర్ లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఆయన సాధించిన రికార్డులు మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక క్రికెట్ పట్ల సచిన్ టెండూల్కర్ కు ఉన్న నిబద్ధత అంకితభావం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు గాయాలు అయిన సమయంలో కూడా లెక్కచేయకుండా అటు జట్టును గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించేవాడు. ఈ క్రమంలోనే సచిన్ దేశం కోసం ఆడటం పట్ల ఎంత నిబద్ధతతో ఉండేవాడు అన్న విషయంపై ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు సౌరబ్ గంగూలీ.
పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ లో పక్కటెముకలు విరిగినప్పటికీ కూడా సచిన్ టెండూల్కర్ జట్టును గెలిపించడం కోసం బ్యాటింగ్ చేశారు అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. మీరు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారు అనే ప్రశ్నకు దాదా ఈ సమాధానం చెప్పాడు. సచిన్ చాలా స్పెషల్. షోయబ్ బౌలింగ్లో పక్కటెముకలకు దెబ్బ తగిలింది. అయినప్పటికీ సచిన్ గాయమైనట్లు చెప్పకుండా దేశం కోసం పరుగులు చేశారు. తర్వాత రోజు ఉదయం చూస్తే రెండు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఇక ఈ విషయం తెలిసి సచిన్ అంకితభావానికి అందరూ ఫిదా అయిపోయారు.