అక్కడ స్టూడెంట్స్ కి మార్కులుండవ్.. కేవలం ఎమోజిలే.. ఎందుకో తెలుసా?
అదే సమయంలో ఒకప్పటిలా అర్థం చేసుకొని చదువుకునే విద్య కాకుండా ఏకంగా బట్టి పట్టి చదువుకునే విద్య ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా మార్కుల కోసం పాట్లు పడటం తప్ప సబ్జెక్టు అర్థం చేసుకోవడం విషయంలో దృష్టి పెట్టడం లేదు విద్యార్థులు. టీచర్లు కూడా ఇలా ఎక్కువగా మార్కులు రావడం పైన దృష్టి పెడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ కూడా మార్కులు ఇవ్వడం లేదంటే గ్రేడ్లు ఇవ్వడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి నిబంధన లేదు.
పరీక్షలు రాసిన విద్యార్థులకు గ్రేడ్లు అస్సలు ఇవ్వరు. అదేంటి గ్రేడ్లు ఇవ్వకుండా వాళ్లు పరీక్షలు ఎలా రాశారు. ఎంత మొత్తంలో సబ్జెక్ట్ నేర్చుకున్నారు అన్న విషయం ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారు కదా. అయితే అంతటా ఉన్నట్లుగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వడం కాదు ఏకంగా మార్కులకు బదులుగా ఎమోజీలు ఇస్తూ ఉంటారు. కేరళ కొచ్చిలోని సీబీఎస్సీ స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. కేజీ నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తారు. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని.. ఒత్తిడి అసలే లేదు అంటూ టీచర్లు చెబుతూ ఉండడం గమనార్హం.