ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో లో మన తెలుగు సినిమాల పరిస్థితి ఇది..?

Pulgam Srinivas
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మన తెలుగు సినిమాలు అనేకం థియేటర్లో విడుదల అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన కొన్ని తెలుగు సినిమాలకు బుక్ మై షో లో మంచి టికెట్లు సేల్ అవుతున్నాయి. ఇక ఆఖరి 24 గంటల్లో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన మన తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలకు ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ విడుదల అయింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన పెడతన చేశారు. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 63.09కే టికెట్లు బుక్ మై షో యాప్ లో సేల్ అయ్యాయి.

టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 21.27 కే టికెట్లు సేల్ అయ్యాయి.

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ తాజాగా నారి నారి నడుమ మురారి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్తా మీనన్ , సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ... రామ్ అబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 18.65 కే టికెట్లు సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: