స్టార్ హీరోలు నటించిన సినిమాలకు , భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాలకు టికెట్ రేట్లను ఈ మధ్య కాలంలో భారీగా పెంచుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దీనితో కొంత మంది సాధారణ ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వచ్చి సినిమా చూడడం కష్టం అవుతుంది. టికెట్ రేట్లు తగ్గిస్తే సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్ కి వచ్చే సినిమాలు చూడడానికి ఎక్కువ శాతం ఆసక్తిని చూపిస్తారు అనే వాదనను వినిపిస్తూ ఉంటే మరి కొంత మంది సినిమాకు బడ్జెట్ చాలా ఎక్కువ అయింది. దానిని రికవరీ చేసుకోవాలి అంటే టికెట్ రేట్లు ఎక్కువగా పెట్టాల్సిందే.
లేదంటే నిర్మాతకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి క్వాలిటీతో సినిమా తీశాం. కాబట్టే ఎక్కువ ధరలను వారు తీసుకుంటున్నారు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం స్టార్ హీరోలు నటించిన సినిమాలకు టికెట్ రేట్లను ఎక్కువగానే పెడుతున్నారు. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఈ మూవీ కి టికెట్ ధరలు ఎక్కువ గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ ఇక్కడ ధరలతోనే ఈ మూవీ ని విడుదల చేయాలి అని నిర్మాతలు భావిస్తున్నట్లు , అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క టికెట్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే 300 రూపాయల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ని ఎలాంటి టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.