ఒక్క ఆటగాడి పైనే.. పది జట్ల కన్ను.. అతను ఎవరంటే?

praveen
ఈ నెలలో జరగనున్న 18వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మెగా వేలం క్రికెట్ లవర్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేస్తోంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో డిసెంబర్ 24, 25 తేదీలలో జరగనున్న ఈ వేలంలో భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌లు రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ కూడా పాల్గొంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరైనా ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికే ఆటగాడు కావచ్చని అభిమానులు భావిస్తున్నారు.
అయితే, ఈ అంచనాలను తలకిందులు చేయగల మరో ఆటగాడు ఉన్నాడు. అతనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్. గత కొన్ని సీజన్‌లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడిన బట్లర్, 2024 ఐపీఎల్ తర్వాత ఆ జట్టు నుంచి విడుదలయ్యాడు. బట్లర్‌ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ అతని సొంతం. కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్‌ను గెలిపించిన అనుభవం కూడా అతని సొంతం. అందుకే ఐపీఎల్ లోని అన్ని 10 ఫ్రాంచైజీలు ఈ టాలెంటెడ్ ప్లేయర్ కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. అంటే, బట్లర్ ఈ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడిగా మారే అవకాశం ఉంది.
బట్లర్ లాంటి ఆటగాడి కోసం అనేక పెద్ద ఐపీఎల్ జట్లు ఆరాటపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు బట్లర్ కోసం పోటీపడే అవకాశం ఉంది. ఈ జట్లకు బలమైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా అనుభవజ్ఞుడైన కెప్టెన్ కూడా అవసరం. బట్లర్ అద్భుతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు కాబట్టి, వేలంలో అతని విలువ ఆకాశాన్ని అంటుతుందని అంచనా.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బట్లర్‌ అన్ని రంగాలలో నైపుణ్యాలు సాధించాడు. అతని టెరిఫిక్ బ్యాటింగ్, వ్యూహాత్మక కెప్టెన్సీ, రేలయబుల్ వికెట్ కీపింగ్ అతన్ని అత్యంత ఆకర్షణీయమైన ఆటగాడిగా మార్చాయి. అతను రికార్డు స్థాయిలో, బహుశా 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. మొత్తం మీద, అన్ని ఐపీఎల్ జట్లు అతన్ని తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి, అతన్ని పొందడానికి వేలంలో తీవ్ర పోటీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: