రోహిత్, కోహ్లీ విభేదాలు నిజమే.. సంచలన విషయం చెప్పిన మాజీ క్రికెటర్?
అయితే ఈ టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడిన విధానం అయితే అందరినీ షాక్ కి గురి చేసింది. టెస్టుల్లో అత్యుత్తమ రికార్డులు కలిగి ఉన్న విరాట్ కోహ్లీ ఇలా బ్యాటింగ్ చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యం లో మునిగిపోయారు. అసలు ఏం జరిగింది టీమ్ ఇండియాలో ఏమైనా విభేదాలు తలెత్తాయా.. ఎందుకు ఇలాంటి ప్రదర్శన చేశారు అని చర్చ జరుగుతున్న సమయంలో మాజీ క్రికెటర్ ఒకరు టీమిండియాలో పరిస్థితులపై షాకింగ్ కామెంట్స్ చేసారు. గతంలో రోహిత్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన వివాదాల గురించి మరోసారి తెరమీదకి తీసుకువచ్చారు. ఆ మాజీ క్రికెట్ ఆయన ఎవరో కాదు ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ బ్రాండన్ జూలియన్.
కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ గంభీలతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి విభేదాలు ఉన్నాయి అంటూ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బ్రాండ్ జూలియన్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ న్యూజిలాండ్ పై అవుట్ అయిన తీరు అసలు నమ్మశక్యంగా లేదు అంటూ వ్యాఖ్యానించారు. అది అతడి ఆట తీరు కాదు. తన కెప్టెన్ కోచ్ తో అతడికి సయోధ్య లేదు అని అనిపిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడతారు. కెప్టెన్గా బౌలర్గా బుమ్రా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటూ బ్రెండెన్ జూలియన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఈ ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ తో ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో కొత్త చర్చ మొదలైంది.