అతను కూడా.. ఐపీఎల్ లో ధోని లాంటోడే.. డివిలియర్స్ ఎవరి పేరు చెప్పాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేక్షకులందరికీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ లీగ్ ప్రారంభం కావడానికి ముందు.. ఏకంగా మెగా వేలం జరగబోతుంది. ఈ మెగా వేలంలో ఏ ఆటగాడికి ఎక్కువ ధర పలుకుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈసారి ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో పాల్గొంటూ ఉండడంతో ఫ్రాంచైజీలు వారి కోసం ఎంతలా పోటీ పడతాయి అనే విషయంపై కూడా అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే ఇలా ఎన్నిసార్లు వేలం జరిగిన ఎంతమంది ప్లేయర్లు భారీ ధర పలికినప్పటికీ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రస్తుతం ఐపీఎల్ లోనే సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు ధోని. అనుభవంలోనే కాదు వయస్సులో కూడా మహేంద్ర సింగ్ ధోని అందరికంటే సీనియర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 40 ఏళ్లు కూడా నిండక ముందే అందరూ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తుంటే మహేంద్రసింగ్ ధోని మాత్రం 40 ఏళ్లు దాటిపోతున్న ఇంకా ఐపీఎల్ లో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు.

 ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సీనియర్ ప్లేయర్ ను మహేంద్రసింగ్ ధోనితో పోల్చాడు ఏబి డివిలియర్స్. ఐపీఎల్ వేలానికి ఇంగ్లాండ్ ఫేసర్ జేమ్స్ అండర్సన్ తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను చూస్తే 40 ఏళ్ల తర్వాత కూడా ఎంతో ఫిట్గా ఆడుతున్న ధోని గుర్తొస్తున్నాడు అంటూ ఆర్సిబి మాజీ బ్యాట్స్మెన్  డివిలియర్స్ అన్నాడు. 42 ఏళ్ళ వయసులో అండర్సన్ ఒక అప్పటిలా బౌలింగ్ చేయకపోవచ్చు. బేస్ ప్రైస్ కి మించి అమ్ముడు పోకపోవచ్చు. కానీ యువ ఆటగాళ్లకు అతడి అనుభవం ఒక వరం. నేనే ఫ్రాంచైజీ ఓనర్ ని అయితే  అతన్ని తప్పకుండా జట్టులోకి తీసుకుంటా అంటూ ఏ బి దివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: