ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పిడుగు పడి ప్లేయర్ మృతి.. వైరల్ వీడియో?

praveen
నేటి దైనందిత జీవితంలో మృత్యువు అనేది ఎప్పుడు ఎటునుంచి కబళిస్తుందో చెప్పడం ఎవరి వల్లా కాదు. ఒకరు జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చనిపోతే, మరికొందరు డాన్సులు వేస్తూ, పాటలు పడుతూ గుండె ఆగి చేస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనే పెరూలో చోటు చేసుకుంది. ఇక్కడ ఓ క్రీడాకారుడు ఆట ఆడుతూ మరణించాడు. పెరూ స్టేడియంలో ఫుట్‌బాల్‌ ఆట ఉత్కంఠ భరితంగా సాగుతోంది. స్టేడియం నిండా జనాలు హోరాహోరీగా తమ టీం గెలవాలని సపోర్ట్ చేస్తూ హోరెత్తి అరుస్తున్నారు. కట్ చేస్తే, ఇంతలో ఊహించని సీన్‌ చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోని ఆటగాళ్లపై పిడుగు పడింది.
దాంతో ఆటగాళ్లలో ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా ఈ ఘటనలో మరో ఐదుగురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, పెరూలోని చిల్కా జిల్లాలోని పెరువియన్‌లోని హువాన్‌కాయో నగరంలో స్థానికంగా జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొక్కా జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌ జరుగుతుండగా.. జోస్ హుగా డి లా క్రూజ్ మెజా (39) అనే ఆటగాడిపై పిడుగు అమాంతం వచ్చి పడింది. దాంతో అతగాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గ్రౌండ్‌లో ప్లేయర్లు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పిడుగు పడడం చాలా బాధాకరం. ఆ సమయంలో జోస్‌ హుగా పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న గోల్ కీపర్ జువాన్ చొక్కా లక్టా (40) కూడా ఉండడంతో పిడుగు ధాటికి అతను కూడా తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఇక మెరుపు దాడి జరిగిన కొద్దిసేపటికే సమీపంలోని ఎనిమిది మంది ఆటగాళ్లు నేలపై పడిపోవడం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోని చూసిన నెటిజనం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం అని కొందరు కామెంట్ చేస్తే, మరి కొందరు ఆ దేవుని స్కెచ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించడం ఎవరి తరమూ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: