IPL 2025 Retention: వేలంలోకి ముగ్గురు కెప్టెన్స్.... క్లాసెన్ రూ.23, కోహ్లీకి రూ.21 కోట్లు?
ఈ లెక్క ప్రకారం... టీమిండియా స్టార్ క్రికెటర్లకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్...ను ఆ జట్టు యాజమాన్యం వదిలేసింది. దీంతో ఆయన మెగా వేలంలో ఉండబోతున్నారు. అలాగే కేకేఆర్ జట్టుకు మొన్నటివరకు కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా... జట్టును వదులుకున్నాడు. దీంతో మెగా వేలంలో అయ్యర్ హాట్ టాపిక్ గా మారారు. ఇక కేఎల్ రాహుల్ మొదటి నుంచి లక్నో సూపర్ జెంట్స్ ను వదిలేస్తారని అందరూ అనుకున్నారు.
దానికి తగ్గట్టుగానే kl రాహుల్... బయటికి వచ్చేసారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు ప్లేయర్లు.. కావాలనే తమ జట్లను వదిలేసారట. వేలంలోకి వస్తే ఈ ఒక్క ప్లేయర్ కు 30 కోట్ల వరకు... ఆఫర్ ఇచ్చాయట ఇతర ఫ్రాంచైజీలు. పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అటు లక్నో జట్ల నుంచి ఈ ముగ్గురికి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అందుకే ఈ ముగ్గురు ప్లేయర్లు కావాలనే యాజమాన్యాలను ఒప్పించి బయటికి వచ్చారట.
ఇది ఇలా ఉండగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో.... హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ అత్యధిక ధర పలికాడు. ఆయనకు ఏకంగా 23 కోట్లు ఇచ్చేందుకు కావ్య పాపా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 21 కోట్లు ఇవ్వనుంది యాజమాన్యం. అటు మహేంద్ర సింగ్ ధోని మళ్లీ సీజన్ ఆడుతున్నారు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లోనే ఉంటున్నాడు.