సీఎస్కేకి మైండ్ దొబ్బిందా.. అతనికి రూ.18 కోట్లా?

praveen

ఐపీల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025 టోర్నమెంట్ కోసం మరికొన్ని క్షణాల్లో మెగా వేలం జరగనుంది. ఇవాళ సాయంత్రం లోపు రిటెన్షన్ లిస్టును ఫ్రాంచైజీలు ఐపీఎల్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవును, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శివం దుబేకు ఏకంగా 18 కోట్లు ఇస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే, టాలెంటెడ్ ఆటగాడు శివం దుబేకు మరీ 18 కోట్లు ఇవ్వడం ఏంటని అతని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం కొసమెరుపు.
మరోవైపు, ఈ ఐపీల్ 2025 మెగా వేలం ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి ఫ్రాంచైజీలకు పెద్ద తలనొప్పిని కలిగిస్తుంది. ఇపుడు సీఎస్కే కఠినమైన ఎంపికలు చేయవలసి ఉంటుంది. శివమ్ దూబేకి మల్లే ఇక్కడ గైక్వాడ్ మరియు జడేజాలకు కూడా .18 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని వినికిడి. ఇక సీఎస్కే పాలిట శివమ్ దూబే ఒక నిధిలాంటివాడు. అతను ఇటీవల చెన్నైలో అత్యుత్తమ ఆటతీరుని కనబరిచాడు. స్పిన్నర్లను భయపెట్టగలిగిన ఏకైన ఆటగాడు అతడు. అతను 2022లో ఫ్రాంచైజీలో చేరినప్పటి నుండి, అత్యుత్తమ ఆటతీరుని కనబరిచాడు. గణాంకాల ప్రకారం, డ్యూబ్ రాచిన్ కంటే చాలా ముందున్నాడు. ఈ క్రమంలోనే శివం దుబేకు మరీ 18 కోట్లు ఇవ్వడం ఏంటని అతని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నట్టు కనబడుతోంది.
కాగా, ఐపీఎల్ 2025 రిటెన్షన్, రైటు టు మ్యాచ్ ఆప్షన్లను ఫ్రాంచైజీలు ఎలా వినియోగించుకుంటాయనే అంశం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. సదరు ప్రాంచైజీలు ఎవరిని జట్టులో ఉంచుకుంటాయి.. ఎవరిని వేలానికి విడుదల చేస్తాయనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఓ రకమైన ఉత్కంఠత నెలకొంది అని చెప్పుకోవచ్చు. దీంతో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి ఉంది. రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేస్తున్నట్లు ప్రసారం జరుగుతుంది. ఈ క్రమంలో సీకేఎస్ జట్టు పంత్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లు ఐపీఎల్ వర్గాల నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

csk

సంబంధిత వార్తలు: