వేలంలో అతనికి రూ.30 కోట్లు.. భారత మాజీ షాకింగ్ కామెంట్స్?
అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించగా, ప్రస్తుతం ఐపీఎల్ 2025 మెగా వేలం రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధపడినట్టు సమాచారం. అక్టోబర్ 31 (గురువారం) సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు రిటెన్షన్ జాబితాలను అధికారికంగా టెలికాస్ట్ చేయనున్నాయి. ఈ సందర్భంగా మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ ఆరుగురి ఆటగాళ్లను నేరుగా లేదా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌తో తిరిగి కొనుగోలు చేసుకొనే వెసులుబాటు ఉంది.
ఇకపోతే, ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించినట్లు వినికిడి. కాగా మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, రిషభ్ పంత్ మెగా వేలంలో వస్తే రూ.30 కోట్లు పలుకుతాడని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే 'రిషభ్ పంత్ మెగావేలంలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన రిషభ్ పంత్ ని కొనడం కోసం ఫ్రాంచైజీలు అయితే ఎగబడుతాయి. మరోవైపు ఆర్‌సీబీకి ఒక వికెట్ కీపర్, బ్యాటర్‌తో పాటు కెప్టెన్ కూడా కావాలి. పంజాబ్, కేకేఆర్, సీఎస్‌కే జట్లకు కూడా రిషభ్ పంత్ అవసరం ఉంది.
ఐతే, ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేసుకోకపోతే మాత్రం ముంబై ఇండియన్స్ కూడా పంత్ కోసం రేసులోకి రాకతప్పదు. లక్నో నికోలస్ పూరన్‌ను రిటైన్ చేసుకున్నా సరే పంత్‌పై ఆసక్తి కనబరచక తప్పదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో పాటు అన్ని జట్లు పంత్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి అతను భారీ ధర పలుకుతాడు. పంత్ ఈ వేలంలో కనీసం రూ. 25-30 కోట్లు దక్కించుకుంటాడు. అని ఆకాశ్ చోప్రా చెప్పుకురావడం విశేషం.