కోహ్లీకి షాక్ ఇవ్వబోతున్న రోహిత్.. అలా చేస్తాడా?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు. ఇద్దరూ భారత జట్టుకి రెండు కళ్ళు లాంటివారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా టీమిండియా భారాన్ని మొత్తం తమ భుజాలపై మోస్తూ ఇక జట్టును విజయపతంలో ముందుకు నడిపిస్తున్నారు. రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు టీమ్ ఇండియా కెప్టెన్ గా సేవలు అందించాడు. ఒకవైపు జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తూనే ఇంకోవైపు కెప్టెన్గా అద్భుతమైన విజయాలు అందించాడు.

 విరాట్ కోహ్లీ నుంచి సారధ్య బాధ్యతలను  అందుకున్న రోహిత్ శర్మ కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే తన కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను అందించి ఇక భారత క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. ఇంకోవైపు మూడు ఫార్మాట్లలో కూడా అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలచిన తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం వన్డే టెస్ట్ ఫార్మట్లలో మాత్రమే కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పటికే అటు టీమిండియా కు కెప్టెన్ గా విక్టరీలు అందించడంలో రోహిత్ శర్మ వరుసగా అరుదైన రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీకి ఒక రికార్డు విషయంలో షాక్ ఇవ్వబోతున్నాడట రోహిత్ శర్మ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరిట రికార్డు  ఉంది.


అయినా డబ్ల్యూటీసీలో ఏకంగా 22 టెస్టులకు కెప్టెన్సీ వహించగా 14 మ్యాచ్ లలో టీమ్ ఇండియా గెలిచింది. ఏడు మ్యాచ్ల్లో ఓడిపోగా ఒకటే డ్రాగ ముగిసింది. అయితే రోహిత్ శర్మ ఇప్పటివరకు 18 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉండగా. ఇందులో 12 విజయాలు నాలుగు పరాజయాలు.. రెండు మ్యాచ్ల డ్రాలు ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే ఇక రోహిత్ కోహ్లీ రికార్డింగ్ బద్దలు కొట్టినట్లే అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: