హ్యారి బ్రూక్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ.. కానీ అగ్రస్థానంలో ఉంది మనోళ్లే?
ఇలా టెస్ట్ ఫార్మాట్లో బాగా ఆడిన ప్లేయర్లే లెజెండరీ ప్లేయర్లుగా ఎదుగుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే టెస్ట్ ఫార్మాట్లో ఇలా రికార్డులు క్రియేట్ అవ్వడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల ఇంగ్లాండు బ్యాట్స్మెన్ హ్యరిబూక్ మాత్రం సెంచరీ డబుల్ సెంచరీ కాదు.. ఏకంగా త్రిబుల్ సెంచరీ చేసేసాడు. టెస్ట్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు అని చెప్పాలి. 310 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు హ్యారి బ్రూక్. మొత్తంగా 32 బంతుల్లో 317 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
దీంతో అతని ట్రిపుల్ సెంచరీ పై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కానీ అతన్ని మించిన ట్రిపుల్ సెంచరీ మన భారత ప్లేయర్ సాధించాడు అన్న విషయం తెలిసి ఇక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. అతను ఎవరో కాదు లెజెండరీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ 304 బంతుల్లో 319 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 42 ఫోర్లు ఐదు సిక్సర్లు ఉన్నాయి. 2004 మార్చ్ 29వ తేదీన ముల్తాన్ టెస్ట్ లో రెండో రోజున సెహ్వాగ్ ఇలా త్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సక్లైన్ ముస్తాక్ వేసిన ఓ బంతిని సిక్సర్ కొట్టి ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత సక్లైన్ ముస్తాక్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆడ లేక పోయాడు. ఇప్పుడు మళ్లీ 20 ఏళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారి బ్రూమ్ ముల్తాన్ మైదానంలోనే ఈ ఘనతను అందుకున్నాడు.