ఇది నాలుగో సారి.. రోహిత్ ఇలా చేస్తాడనుకోలేదు?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటాడు. సాధారణంగా రోహిత్ శర్మ  అగ్రశ్రేణి టీమ్స్ పై ఎంతలా బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది చిన్న టీమ్స్ తో మ్యాచ్ జరుగుతుంది అంటే రోహిత్ బ్యాట్ నుంచి దాదాపు డబుల్ సెంచరీ వస్తుందని అభిమానులు అందరూ కూడా అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు.

 రోహిత్ శర్మ క్రీజులో కుదురుకున్నాడు అంటే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడు అని ప్రత్యర్ధులు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మకు బౌలింగ్ వేయాలంటే బౌలర్లు వణికిపోతూ ఉంటారు. కానీ అలాంటి రోహిత్ శర్మ ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మాత్రం తన బ్యాటింగ్ తో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తన వ్యూహాలతో జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తూ.. బంగ్లాదేశ్ టీం పై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ బ్యాటరీ గా మాత్రం సక్సెస్ కావట్లేదు.

 అయితే మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్ లో అయినా సత్తా చాటుతాడని అందరూ అనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇలా రెండు ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు అని చెప్పాలి. అయితే రోహిత్ విషయంలో ఇలా కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిగింది. ఒకే టేస్టులో రెండు ఇన్నింగ్స్ లలో  రోహిత్ రెండు అంకెల స్కోరు దాటకపోవడం ఇది నాలుగో సారి మాత్రమే. ఇంతకుముందు 2015లో శ్రీలంకపై, 2015, 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్టుల్లో రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ స్కోర్ కే విలియం చేరాడు. వచ్చే టెస్ట్ లో అయినా రోహిత్ పుంజుకోవాలని   అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: