రోహిత్, కోహ్లీ వల్ల.. కేఎల్ రాహుల్ కు అన్యాయం?

praveen
సాధారణంగా క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లకు విపరీతమైన పాపులారిటీ ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే  ఆయా ఆటగాళ్ళు ఒక్కసారి మంచి ప్రదర్శన చేసిన చాలు సోషల్ మీడియా మొత్తం వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. అదే అలాంటి ప్రదర్శన మరొక ఆటగాడు చేస్తే వారి గురించి ఎక్కడ కనిపించదు.  అయితే టీమ్ ఇండియాలో ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతుంది ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పేర్లే గుర్తుకు వస్తూ ఉంటాయి.

 ఇద్దరు కూడా భారత జట్టుకు రెండు పిల్లర్లుగా కొనసాగుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎన్నో ఏళ్లపాటు టీం ఇండియాను కెప్టెన్గా ముందుకు నడిపించాడు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పుడు సారధిగా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు రోహిత్ శర్మ. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. అయితే ఈ ఇద్దరు ఒక్కసారి మంచి ప్రదర్శన చేసిన సోషల్ మీడియాలో వీరిపై భారీ రేంజ్ లోనే ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అందరూ. ఇక ఇద్దరికీ ఉన్న క్రేజ్ కారణంగా అదే టీమ్ ఇండియా తరపున ఆడుతూ మంచి ప్రదర్శన చేసినప్పటికీ సరైన పాపులారిటీ దక్కించుకొని క్రికెటర్లు కొంతమంది ఉన్నారు అని చెప్పాలి.

 అలాంటి వారిలో భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఎన్ని రన్స్ చేసిన అతను రోహిత్, విరాట్ కోహ్లీలకు ఉన్న పాపులారిటీ కారణంగా.. అతడి ప్రతిభ ఆ వారి నీడలోనే ఉండిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. జట్టులో చోటు కోసం కేఎల్ రాహుల్ ఎప్పటికప్పుడు పరుగులు చేయక తప్పదు. నేనే సెలెక్టర్ అయితే అతడికి జట్టులో సుదీర్ఘకాలం అవకాశాన్ని ఇస్తాను. కష్టమైన సమయాల్లో జట్టు కోసం అతను రన్స్ చేసినా ఎందుకో తనపై జనంలో వ్యతిరేకత కనిపిస్తుంది అటు ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: