టీమిండియాలో నో ఛాన్స్.. కట్ చేస్తే అదిరిపోయే సెంచరీ?
భారత జట్టులోకి వచ్చి అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ అప్పటికే తమ ప్రతిభ ఏంటో నిరూపించుకున్న ఆటగాళ్లకు సైతం ప్రతి మ్యాచ్ ఒక సవాలుగా మారిపోయింది. ఒక్క మ్యాచ్లో విఫలమైన కూడా ఏకంగా జట్టులో చోటు ఉంటుందా ఊడుతుందా అనేది తెలియకుండా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఇలా రెండు మూడు మ్యాచ్లలో బాగా రాణించలేక జట్టులో చోటు కోల్పోయిన వారు ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో ఇషాన్ కిషన్ కూడా ఒకరు. ఎన్నో రోజుల కిందట టీమిండియాలో చోటు కోల్పోయిన ఈ యువ ఆటగాడు.. మళ్లీ భారత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు.
అయితే టీమ్ ఇండియాలో చోటు కోల్పోయిన ఓపెనర్ ఇషాన్ కిషన్ అటు దులీప్ ట్రోఫీలో మాత్రం అదరగొట్టాడు. ఇండియా సి తరఫున ఆడుతున్న అతను ఏకంగా సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇండియా b తో జరిగిన మ్యాచ్లో 126 బంతుల్లో 14 ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో 112 పరుగులు చేశాడు. ఇక ఇదే మ్యాచ్లో ఇంద్రజిత్ 78 ఋతురాజ్ 46 సుదర్శన్ 43 రజాత్ పాటీదార్ 40 రానిచడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా సి జట్టు 357/7 పరుగులు చేసింది. కాదా ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో కూడా ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు అన్న విషయం తెలిసిందే.