పూజార, రహానే ప్లేసులో.. ఆ ఇద్దరైతేనే బెటర్ : డీకే

praveen
నవంబర్ నెలలో  టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో ఎప్పుడు టెస్ట్ సిరీస్ జరిగినా అది టీమ్ ఇండియాకు ప్రతిష్టాత్మకమే. దీంతో ఆ దేశంతో జరగబోయే టెస్ట్ సిరీస్ ను టీమ్ ఇండియా ఈజీగా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు అని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ఎలా ఉంటుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇక జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారో అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే గతంలో టీమిండియా ఏదైనా టెస్ట్ సిరీస్ ఆడుతుంది అంటే చాలు జట్టులో తప్పకుండా చోటు సంపాదించుకుంటారు అనే ఆటగాళ్ళు ఇద్దరు ఉండేవారు. వాళ్లే అజింక్య రహానే, చేతేశ్వర్ పూజార. ఈ ఇద్దరినీ భారత క్రికెట్ ప్రేక్షకులు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు అని పిలుచుకునేవారు. మిగతా ఫార్మాట్లకు దూరంగా ఉండే ఈ ప్లేయర్లు టెస్ట్ ఫార్మట్ లో మాత్రం తప్పక ఛాన్స్ దక్కించుకునేవారు. కానీ ఇద్దరు కూడా ప్రస్తుతం టీమిండియాలో ఛాన్స్ కోల్పోయారు. ఇక మళ్ళీ వస్తారన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు.

 దీంతో ఈ ఇద్దరు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ల  స్థానాన్ని భారతి చేసే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్ స్పందించారు. ఆస్ట్రేలియా తో నవంబర్ 22వ తేదీ నుంచి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి గిల్, సర్ఫరాజ్ను ఎంపిక చేయాలంటూ సూచించాడు. సీనియర్లు పూజార, రహనే స్థానంలో వీరిద్దరూ ఆడితే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్లో వీరిద్దరూ రాణించారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే సీనియర్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనని.. కానీ ఇక వీరికి వరుసగా అవకాశాలు ఇస్తే ఫ్యూచర్లో  మెరుగ్గా రాణిస్తారు అంటూ డీకే చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: