షాకింగ్ : డ్రెస్సింగ్ రూమ్ లో కొట్టుకున్న పాకిస్తాన్ ఆటగాళ్ళు?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకప్పుడు చాంపియన్ టీంగా ఐసిసి టోర్నీలలో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు గత కొంతకాలం నుంచి కేవలం ఐసిసి టోర్నీలలో మాత్రమే కాదు సాదాసీదా ద్వైపాక్షిక సిరీస్లలో కూడా సత్తా చాటలేక పోతుంది. మరి ముఖ్యంగా పసికూన టీమ్స్ చేతుల్లో సైతం దారుణమైన ఓటములను చవిచూస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే గత కొంతకాల నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారాలలో రాజకీయ జోక్యం ఏర్పడటం కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 అదే సమయంలో క్రికెట్ బోర్డు చైర్మన్ దగ్గర నుంచి కోచింగ్ స్టాఫ్, సెలక్టర్లు, కెప్టెన్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా తరచూ మారుతూనే వస్తున్నారు. దీంతో ఇక పాకిస్తాన్ జట్టు తీరు అస్తవ్యస్తంగా మారిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ఆటగాళ్ల మధ్య ఎలాంటి సఖ్యత లేకపోవడంతో.. ఇక ఏ ఫార్మాట్లో కూడా సత్తా చాట లేక పోతుంది. అంతేకాదు ఆటగాళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా ఇక ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఇటీవల బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం చేతిలో సైతం పాకిస్తాన్ కు ఘోర ఓటమి తప్పలేదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు వారి సొంత గడ్డం మీదే ఓడిపోయింది.

 అయితే ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళ గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్, ఆ జట్టు స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదిలు కొట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహమ్మద్ రిజ్వాన్  కూ కూడా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ముందు కెప్టెన్ షాన్ మసూద్ మైదానంలో షాహిన్ ఆఫ్రిది భుజంపై చేయి వేయగా ఇక కోపంతో షాహిన్ ఆఫ్రిది ఆ చేయిని తీసివేయడంకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఆ తర్వాత రెండో టెస్టులో షాహిన్  జట్టులో చోటు కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: