పాకిస్తాన్ ఓవర్ కాన్ఫిడెన్స్.. గట్టిగా బుద్ధి చెప్పిన బంగ్లాదేశ్?
ఏకంగా చిన్న టీమ్స్ చేతుల్లో సైతం ఓడిపోయి అభిమానుల ఆగ్రహావేషాలకు గురవుతుంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా పాకిస్తాన్ కు ఇలాంటి పరాభవం ఎదురయింది. చిన్న టీం అయిన బంగ్లాదేశ్ జట్టు అసాధారణమైన అటతీరుతో ఛాంపియన్ పాకిస్తాన్ జట్టుకు గట్టి కౌంటర్ ఇస్తోంది. పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ను బంగ్లా బ్యాటర్లు గట్టిగానే దెబ్బ కొట్టారు అని చెప్పాలి. ఇటీవలే జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు తొలత బ్యాటింగ్ చేసింది. 448 పరుగులు చేసింది. ఆరంభంలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని భారీ స్కోర్ చేయగలిగింది.
అయితే 448 పరుగుల భారీ స్కోర్ చేసిన తర్వాత ఇక ఈ భారీ స్కోర్ బంగ్లాదేశ్ ను రెండు సార్లు ఆల్ అవుట్ చేయడానికి సరిపోతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే కెప్టెన్ షాన్ మసూద్ ఇన్నింగ్స్ ని కూడా డిక్లేర్ చేశారు. 500 స్కోర్ చేసే అవకాశం ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు అటు పాకిస్తాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై దెబ్బకొడుతూ 448 పరుగుల స్కోర్ ని దాటేస్తూ భారీ స్కోరు దిశగా దూసుకు వెళ్తుంది. ఇప్పటికే 460 కి పైగా పరుగులు చేసేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితులు చూసి అటు అభిమానులు అందరూ కూడా పాకిస్తాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.