ధోని ఫ్యాన్స్ కి సారీ చెప్పిన దినేష్ కార్తీక్.. ఎందుకో తెలుసా?
ఇక సాధారణంగా భారత క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు ధోని గురించి తక్కువ చేసి మాట్లాడాడు అంటే చాలు ఇక అతన్ని మహేంద్రుడి అభిమానులు ఇంటర్నెట్లో ట్రోలింగ్ చేస్తూ తెగ ఆడుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల మహేంద్రసింగ్ ధోని అభిమానులు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా విమర్శలు చేయడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. టీమిండియా మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఇటీవలే భారత క్రికెట్లో తన ఆల్ టైం జట్టును ప్రకటించాడు.
అయితే ఈ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ లకు స్థానం కల్పించిన డీకే అటు ధోనీకి మాత్రం చోటు కల్పించలేదు. ధోని లాంటి కెప్టెన్ ను ఇలా ఆల్ టైం ఫేవరెట్ జట్టు నుంచి తప్పించడం ఏంటి అంటూ అందరూ విమర్శలు చేస్తుండగా.. ఇక ఈ విషయంపై స్పందిస్తూ డీకే ధోని అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ వీడియో రిలీజ్ అయ్యాకే ఆ టీంలో వికెట్ కీపర్ లేడని గుర్తించాను. ధోని ఏ జట్టులోనైనా ఉండాల్సిన ప్లేయర్. గొప్ప కెప్టెన్. అతనికి నా ఆల్ టైం ఫేవరెట్ జట్టులో నెంబర్ సెవెన్ ప్లేయర్గా, కెప్టెన్గా రీప్లేస్ చేస్తాను క్షమించండి అంటూ డీకే ఒక వీడియో విడుదల చేయగా.. ఇది వైరల్ గా మారింది.