కాలా చస్మా పాటకు ఇండియన్ ఒలింపిక్ మెడలిస్టు అదిరిపోయే డ్యాన్స్..?

praveen

పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ఒకేసారి రెండు మెడల్స్ సాధించి పెట్టిన బంగారు తల్లి మను భాకర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ స్టార్ షూటర్ తన ప్రత్యేకమైన ప్రతిభలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఈసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది! ఆమె తుపాకీ కాల్చడంలో మాత్రమే కాదు, అద్భుతంగా డాన్స్ చేయడంలోనూ నిపుణురాలు అని ప్రూవ్ చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్, ఒక స్కూల్ ఫంక్షన్‌లో 'కాలా చష్మా' అనే పాటకు అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ అలరించింది
చెన్నైలోని ఒక బాలికల పాఠశాలలో యాన్యువల్ ఫంక్షన్ లో మను భాకర్ డాన్స్ చేసింది. ఆమె క్యూట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మను 2016లో వచ్చిన 'బార్ బార్ దేకో' అనే సినిమాలోని పాటకు డాన్స్ చేసింది. మను భాకర్ డాన్స్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. వీడియోకి లైక్‌లు, కామెంట్లు పెడుతూ ఆమె డాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మను భాకర్‌ని “2032 ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకోవడం” అనే అంశంపై వేలమ్మల్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనే ఆమె డ్యాన్స్ చేసింది. మను భాకర్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌ టోర్నీలో రెండు పతకాలు గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్, 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది.
మను భాకర్ హర్యానా రాష్ట్రంలోని గోరియా అనే చిన్న గ్రామం నుంచి వచ్చింది. ఆమె నాన్న రామ్ కిషన్ భాకర్‌ మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పని చేస్తారు. ఆమె అమ్మ సుమేధ గోరియాలోని ఒక స్కూల్‌లో హెడ్ మిస్ట్రెస్‌గా పనిచేసేవారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రసిద్ధ లేడీ శ్రీ రామ్ కళాశాల నుండి మను భాకర్ గ్రాడ్యుయేషన్ చేసింది. ప్రస్తుతం ఆమె చండీగఢ్‌లోని డీఏవీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేస్తోంది. ఈ లింకు https://x.com/randhirmishra96/status/1825848600888295870?t=ImkGWCsfSxjuTPBDb-QsgQ&s=19 పై క్లిక్ చేసి ఈ ఒలింపిక్ ఛాంపియన్ అదిరిపోయే డాన్స్ స్టెప్పులు చూడవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: