బ్రిటీష్‌ సింగర్‌తో పాండ్య డేటింగ్‌..ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే?

Veldandi Saikiran
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ గత నెలలో వారి వివాహ బంధానికి వీడ్కోలు పలికారు. వీరి విడాకుల వార్త తెలిసిన ఎంతోమంది అభిమానులు షాక్ కి గురయ్యారు. అప్పటినుంచి వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్లు అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


ఆమె బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా. వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళినట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని గంటల క్రితం హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. గ్రీస్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. దీనికి నాలుగు రోజుల ముందు జాస్మిన్ కూడా ఇదే లొకేషన్ లో ఫోటోలు దిగి తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. దీంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్ళినట్లు అనేక రకాల వార్తలు మొదలయ్యాయి.


అంతేకాకుండా.... ఈ పోస్టులను ఒకరికొకరు లైక్ చేసుకోవడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. గతంలోనూ జాస్మిన్ పెట్టిన పలు పోస్టులకు పాండ్యా కామెంట్స్ చేశాడు. ఈ సమయంలోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరి పోస్టులు వైరల్ గా మారాయి. ఇంగ్లాండ్ లోని ఎసేక్స్ ప్రాంతానికి చెందిన జాస్మిన్ తోలుత టీవీ సీరియల్లలో నటించింది. అంతేకాకుండా పలు రియాల్టీ షోలలో పాల్గొని అభిమానులకు దగ్గర అయింది.

2019లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పలు ఆల్బమ్స్ లను క్రియేట్ చేసింది. ఆమె పాడిన "బామ్ డిగీ" పాటను ఓ బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్ కు చెందిన జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఇన్ స్టాలో ఆమెకు 6.4 లక్షల మంది ఫాలోవర్లు సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా....ప్రస్తుతం జాస్మిన్, హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: