10 గంటల్లోనే 4.6 కిలోల బరువు తగ్గిన బ్రాంజ్ మెడలిస్ట్ అమన్..?
అమన్ సెహ్రావత్ కష్టపడి చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలంగా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ముఖ్యంగా వెయిట్ తగ్గించుకోవడానికి ఇతడు చాలా కృషి చేశాడు. సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత, అతని బరువు 61.5 కిలోలుగా ఉంది. కాంస్య పతకం కోసం పోటీ పడాలంటే, కేవలం 10 గంటల్లో 4.5 కిలోలు తగ్గాల్సి వచ్చింది. అంటే, అతను తన శరీరంలోని అదనపు నీరు, కొవ్వును తొలగించి, నిర్ణీత బరువును చేరుకోవాలి. ఇది రెజ్లింగ్ క్రీడాకారులకు సాధారణంగా జరిగే విషయమే.
రెండవ రోజు ఉదయం బరువు తూకంపై నిలబడినప్పుడు, అమన్ నాలుగున్నర కిలోలు బరువు తగ్గాడు. అంటే, 57 కిలోల బరువు విభాగంలో ఇతడు పోటీ పడాల్సి వచ్చింది. అందుకు తను అతను 4.5 కిలోలు తగ్గాల్సి ఉండగా 4.6 కిలోలు తగ్గాడు. కోచ్‌లు జగమందర్ సింగ్, విరేందర్ దాహియా అతనికి సహాయం చేశారు .
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫిమేల్ రెజ్లర్ వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు ఉన్నందున పోటీ నుండి తొలగించబడింది. కానీ అమన్ మాత్రం 100 గ్రాములు తక్కువకు బరువు తగ్గాడు. అంటే, అతను 57 విభాగంలో ఆడతాడు కాబట్టి 100 గ్రాములు తక్కువగా ఉన్నా అతడిని క్వాలిఫై చేశారు. ఇటికల్ లిమిట్ దగ్గర ఉన్నాడని చెబుతూ క్వాలిఫై చేశారు. వినేష్‌ను మాత్రం డిస్క్ క్వాలిఫై చేశారు.
గురువారం సాయంత్రం 6:30 గంటలకు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అమన్ జపాన్ ప్లేయర్ రై హిగుచిపై ఓడిపోయాడు. అయితే, అతనికి విచారించే సమయం లేదు. ఎందుకంటే, అతను కాంస్య పతకం కోసం పోటీ పడాలంటే తన బరువును తగ్గించుకోవాలి. మొదట, మాజీ కోచ్‌లు అతనితో కలిసి ఒక గంటన్నర సేపు కుస్తీ ఆడించారు. ఈ కఠినమైన శిక్షణ వల్ల అతని శరీరం నుండి అదనపు నీరు బయటకు వచ్చింది. తర్వాత, అతను ఒక గంట పాటు వేడి నీటి స్నానం చేశాడు. ఆపై అతను గంటసేపు నిరంతరం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తాడు. కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత, అతను ఐదు సార్లు ఐదు నిమిషాల పాటు ఆవిరి స్నానం చేశాడు.
అన్ని శిక్షణల తర్వాత కూడా అమన్ ఇంకా 900 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అతనికి మసాజ్ చేశారు. అనంతరం, కోచ్‌లు అతన్ని కాస్త నెమ్మదిగా పరుగెత్తమని అడిగారు. దాంతో 15 నిమిషాల పాటు ఐదు సార్లు పరుగెత్తాడు. ఉదయం 4:30 గంటలకు అమన్ బరువు 56.9 కిలోలుకు చేరుకుంది, అంటే నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు తక్కువ. దీంతో కోచ్‌లు, అమన్ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో అమన్‌కు వెచ్చని నీరు, నిమ్మకాయ, తేనె, కాఫీ కొద్దిగా ఇచ్చారు. ఆ తర్వాత అమన్ నిద్రపోలేదు. రెజ్లింగ్ మ్యాచ్లు చూస్తూ ఎలా ఆడగలగాలో తెలుసుకున్నాడు. ఉదయాన్నే బ్రాంజ్ మెడల్ సాధించి ఆశ్చర్యపరిచాడు.