ఇలాంటి క్యాచ్.. జీవితంలో చూసి ఉండరు.. వైరల్ వీడియో?

praveen
ఈ మధ్యకాలంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ప్రపంచ దేశాలకు పాకి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు ఇక తమ దేశంలో క్రికెట్ జట్టును ఏర్పాటు చేసి అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో క్రికెట్ కి పెరిగిపోతున్న క్రేజ్ దృశ్య వరల్డ్ క్రికెట్లో ఏ మ్యాచ్ జరిగిన కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని షాకింగ్ ఘటనలు జరుగుతూ ఉంటే.. అవి చూసి నిజమేనా అని కళ్ళతో చూసిన ప్రేక్షకులు కూడా నమ్మలేని విధంగా ఉంటుంది పరిస్థితి.


 అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు దానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్లలో ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతమైన విన్యాసాలు చేసి క్యాచ్లు అందిపుచ్చుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని ప్రేక్షకులను అబ్బురపరిచే క్యాచులు ఉంటాయి. ఇక ఇప్పుడు క్రికెట్ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పట్టిన ఒక క్యాచ్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.


 యూరోపియన్ క్రికెట్ సిరీస్ 2024 టోర్నీలో VTU - MU లెవెన్ జట్టు ప్లేయర్ గుర్నథ్ దలియాన్ ఒక క్యాచ్ అందుకున్నాడు. క్రికెట్ హిస్టరీలోనే ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఇలాంటి క్యాచ్ అందుకోలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటర్ కొట్టిన బంతి గాలిలోకి లేవగా అందుకునేందుకు అతను ముందుకు పరుగులు పెడుతూ వచ్చాడు. అయితే బంతి నేలకు తాకే టైంలో అతను తన కాలును ముందుకు పెట్టాడు. అయితే ఈ సమయంలో బాల్ అతని షూ కి తాకి మళ్ళీ గాల్లోకి లేచింది. దీంతో వెంటనే అతను అప్రమత్తమై క్యాచ్ అందుకున్నాడు. ఇక ఈ క్యాచ్ చూసి గ్రౌండ్లో ఉన్న ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యంగా మునిగిపోయారు అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారగా తమ జీవితంలో ఇలాంటి క్యాచ్ చూడలేదు అంటూ న
నేటిజన్స్ ఈ వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: