క్రికెట్ మ్యాచ్ అంటే ఇట్టా ఉండాలా.. చివరికి గెలిచింది మనోళ్లే?
ఎందుకంటే క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతి నుంచే సిక్సర్లు బాదటం మొదలు పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలనే మైండ్ సెట్ తో వీరబాదుడు బాధేస్తూ ఉంటే.. ఇది చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఎగిరి గంతేస్తూ ఉంటారు. మరోవైపు అటు బౌలర్లు కూడా అద్భుతమైన బంతులు సంధిస్తూ వికెట్లను పడగొడుతున్న తీరు చూస్తున్న ప్రేక్షకులు అందరిని కూడా మంత్రముగ్దులను చేసేస్తూ ఉంటుంది. అయితే ఈ పొట్టి ఫార్మాట్లో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిపోతే.. ఇక అంతకంటే క్రికెట్ ప్రేక్షకులకు ఇంకేం కావాలి అనుకుంటారు.
కానీ ఇలా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ టై గా ముగిస్తే.. ఏకంగా సూపర్ ఓవర్ జరిగితే అబ్బో ఆ ఉత్కంఠను మాటలో వర్ణించడం చాలా కష్టం. ఇటీవల శ్రీలంక భారత్ మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఇలాంటిదే జరిగింది. ఏకంగా నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు కూడా 137 పరుగుల చేశాయి. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. 15.2 ఓవర్లలో 110/2 స్కోరుతో బలంగా ఉన్న ఆ జట్టు ఆ తర్వాత 12 పరుగులు తేడాతో ఆరు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. కెప్టెన్ సూర్య అనూహ్యంగా బౌలింగ్ వేసి మ్యాచ్ టై గా ముగించాడు. దీంతో సూపర్ ఓవర్ లో చివరికి భారత జట్టు విజయం సాధించింది.