కొడుకు బర్త్ డే.. హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్?

praveen
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ జంటల విడాకులు సోషల్ మీడియాలో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అన్యోన్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్న సెలబ్రిటీ జంటలు అకస్మాత్తుగా తమ విడాకులకు సంబంధించి ప్రకటన చేస్తూ అభిమానులందరికీ కూడా షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇలాంటి ఒక సెలబ్రిటీ జంట  విడిపోయింది. వారు ఎవరో కాదు ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.


 ఎన్నో రోజుల నుంచి హార్దిక్ పాండ్యా భార్య నటాషా తో విడిపోబోతున్నాడు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇక ఈ వార్తలపై వీరు స్పందించకపోవడంతో కేవలం పుకార్లు మాత్రమే అనుకున్నారు. కానీ ఇటీవల విడాకులను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన కొడుకు అగస్త్యను తీసుకొని సెర్బియా వెళ్ళిపోయింది. కాగా విడాకుల తర్వాత టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ పోస్ట్ పెట్టిన కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి.


 అయితే ఇటీవలే హార్దిక్ పాండ్యా తన కొడుకును తలుచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. హార్థిక్ పాండ్యా కొడుకు ఆగస్టు జూలై 30వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటు న్నాడు. ఇది హార్దిక్ పాండ్యాకు ఎంతో ప్రత్యేకం. ఈ క్రమంలోనే హార్దిక్  ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది   తన కుమారుడితో కలిసి ఉన్న మధుర క్షణాలను ఒక వీడియోలో పొందుపరిచాడు హార్దిక్. నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు నువ్వే కారణం  నా పార్టనర్ ఇన్ క్రైమ్   నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు  నువ్వు ఎక్కడున్నా నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది  నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు కూడా సరిపోవు అంటూ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: