భారత క్రికెటర్ ముఖంపై రక్తపు మరకలు.. అసలేం జరిగిందంటే?
ఒకవైపు బ్యాట్స్మెన్ అందరూ కూడా వీరబాదుడు బాధితే ఇంకోవైపు బౌలర్లు తమ బౌలింగ్ తో ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను పనికించారు అని చెప్పాలి. ఇలా అన్ని విభాగాల్లో అటు శ్రీలంకపై పైచేయి సాధించిన టీమ్ ఇండియా మొదటి టీ20 మ్యాచ్ లోనే ఘన విజయాన్ని సాధించి 1-0 తేడాతో ఆదిక్యాన్ని సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా భారత యంగ్ బౌలర్ మొహానికి గాయం అయింది. ఏకంగా రక్తం కూడా కారింది. ఇది చూసి భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అని చెప్పాలి.
శ్రీలంకతో జరిగిన తొలి t20 భారత యంగ్ బౌలర్ రవి బిష్ణయ్ గాయపడ్డాడు. 16 ఓవర్ లో అతను వేసిన తొలి బంతిని లంక బ్యాట్స్మెన్ మొండిస్ షాట్ కొట్టాడు. అయితే దాన్ని రిటర్న్ క్యాష్ అందుకునేందుకు రవి బిష్ణయ్ ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి గాయమైంది. బంతిని అందుకునే క్రమంలో అతని కంటి కింద బలంగా బంతి తాకింది. దీంతో ముఖంపై రక్తం మరకలు అయ్యాయి. ఇక ఆ తర్వాత బ్యాండేజ్ వేసుకుని ఆటను కొనసాగించిన బిష్ణయ్ చివరి బంతికి అసలంకను పెవిలియన్ పంపించాడు. కాగా అతని డెడికేషన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.