హెడ్ కోచ్ గా గంభీర్.. సూర్య కుమార్ ఏమన్నాడంటే?

praveen
ఇండియన్ క్రికెట్లో టి20 ఫార్మాట్ లో కొత్త శకం మొదలైంది అని చెప్పాలి. ఎందుకంటే కోచ్ తో పాటు అటు కెప్టెన్ కూడా పూర్తిగా మారిపోయారు. మొన్నటి వరకు భారత జట్టును t20 ఫార్మాట్ లో మాత్రమే కాదు అన్ని ఫార్మాట్లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా ముందుకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక టీమిండియా కు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించాడు. అయితే ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు ఘన విజయాన్ని అందించాడు రోహిత్. ఏకంగా వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు.

 అయితే ఇలా వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న వెంటనే తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మరోవైపు భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వహించిన రాహుల్ ద్రావిడ్ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో ఇక ప్రధాన కోచ్గా అటు గౌతమ్ గంభీర్ ని బిసిసిఐ ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో టి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ కి కెప్టెన్సీ అప్పగిస్తూ బీసీసీఐ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరిద్దరి శకం టి20 ఫార్మాట్లో భారత జట్టుకు ఎలాంటి విషయాలు అందించబోతుంది అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే ఇలా భారత జట్టుకు కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ రావడం గురించి ఇక భారత టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ తో తన బంధం ఎప్పటికీ ప్రత్యేక అంటూ సూర్య కుమార్ యాదవ్ అన్నాడు. 2014లో అతని నాయకత్వంలో కోల్కతా జట్టు తరఫున ఆడినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రీడలో మన ప్రదర్శన ఎలా ఉన్నా వినయంగా ఉండాలని నేర్చుకున్నాను. అంతేకాదు మైదానంలో ఏం సాధించినా దాన్ని అక్కడే వదిలేయాలని తెలుసుకున్నాను అంటూ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: