మైదానంలో బెన్ స్టోక్స్ డూప్.. అరెరే అచ్చుగుద్దినట్టు ఉన్నాడే?
కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇలా మనిషినీ పోలిన మనిషి ఉండడం అనేది చాలా అరుదు. కేవలం కవల పిల్లలుగా పుట్టిన వారు మాత్రమే ఇలా ఒకే పోలికలతో ఉండటం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మధ్యకాలంలో మాత్రం ఎందుకో ఏకంగా స్టార్ క్రికెటర్ల లాగానే ఆచ్చు గుద్దినట్లు ఉండే కొంతమంది మనుషులు స్టేడియంలో దర్శనమిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. గతంలో ఏకంగా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ లాగే ఒక అభిమాని మైదానంలో దర్శనమిచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక తర్వాత కాలంలో విరాట్ కోహ్లీ పోలికలతో ఉన్నప్రేక్షకుడు కూడా స్టేడియంలో కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.
ఇక ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ డూప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే ఈసారి ఇండియన్ ప్లేయర్ కాదు ఏకంగా ఇంగ్లాండ్ ప్లేయర్ లాంటి ఒక డూప్ వ్యక్తి కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లాగే ఉండే ఒక వ్యక్తి మైదానంలో సందడి చేశాడు. ముఖ కవలికలు హావభావాలు అన్నీ కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ లాగే ఉన్నాయి. అతడిని చూసిన బెన్ స్టోక్స్ తో పాటు అండర్సన్ సహ కామంటేటర్లు అందరూ కూడా పగలబడి నవ్వుకున్నారు అని చెప్పాలి. దీంతో ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. బెన్ స్టోక్స్ అయితే అక్కడ ఉంది తన డూప్ అన్న విషయాన్ని నమ్మలేకపోయాడు. ఇక వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో వైరల్ గా మారింది.