రిటైర్మెంట్.. జేమ్స్ అండర్సన్ చివరి వికెట్ ఎవరో తెలుసా?

praveen
సాధారణంగా క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకి కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు. క్రికెట్ విశ్లేషకులు చెప్పడమే కాదు ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే అతి తక్కువ కాలంలోనే తమ ఆటకు వీడ్కోలు పలకడం కూడా చూస్తూ ఉంటాం. ఎంతో మంది బ్యాట్స్మెన్లు 40 లేదా 40 ప్లస్ ఏజ్ లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ ఉంటే.. బౌలర్లు మాత్రం 38 ఏళ్లు కూడా నిండకముందే రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఫాస్ట్ బౌలర్లకు గాయాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక త్వరగా ఫిట్నెస్ ను కోల్పోయే అవకాశం ఉంటుందని.. అందుకే ఇక త్వరగా వీడ్కోలు ప్రకటిస్తూ ఉంటారు అంటూ ఎంతో మంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కానీ అందరి విషయంలో వేరు మనం మాట్లాడుకునే ఇతని విషయంలో మాత్రం వేరు. అతను అందరిలాగానే ఫాస్ట్ బౌలర్. అది కూడా ఒక లెజెండ్.  కానీ అతను అందరిలా తొందరగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఏకంగా 40 ఏళ్ల వయసు దాటిపోతున్న రిటైర్మెంట్ ఆలోచన చేయలేదు. దాదాపు 21ఏళ్ళ పాటు అంతర్జాతీయ క్రికెట్లో రాణించాడు. స్టార్ బౌలర్గా ఎన్నో రికార్డులు అందుకున్నాడు.

 నేటి తరానికి ఒక లెజెండరీ ప్లేయర్ గా మారిపోయాడు. అతను ఎవరో కాదు ఇంగ్లాండ్ ఫేసరు జేమ్స్ అండర్సన్. అయితే రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు ఆడిన చివరి మ్యాచ్ లో కూడా అదరగొట్టేసాడు. వెస్టిండీస్తో జరిగిన టెస్టులో అదిరిపోయే స్పెల్ తో అదరగొట్టాడు.. అయితే ఇటీవలే జేమ్స్ అండర్సన్ రిటర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతని బౌలింగ్లో చివరిగా అవుట్ అయిన ప్లేయర్ ఎవరు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో డా సిల్వను ఔట్ చేశాడు. అయితే ఈ వికెట్ తీసి తను 21 క్రికెట్ కెరీర్ కు ముగించాడు జేమ్స్ అండర్సన్. తన కెరీర్ కాల మొత్తంలో 108 టెస్ట్ లతో  704 వికెట్లు పడగొట్టాడు ఈ స్టార్ బౌలర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: