టెస్టుల్లో హార్దిక్ ఆడితే.. ఇక మనకు తిరుగు ఉండదు : గవాస్కర్

praveen
టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఇక జట్టులో ఎంతో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నాడు అంటే అదనపు బౌలర్ తో పాటు అదనపు బ్యాట్స్మెన్ కూడా జట్టులో ఉన్నట్లు మారిపోతూ ఉంటుంది పరిస్థితి. అందుకే ఇక అతన్ని ఎప్పుడు టీమిండియాలో భాగం చేయాలని సెలెక్టర్లు కూడా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు హార్దిక్ పాండ్యాని జట్టులోకి ఎంపిక చేయడం పై విమర్శలు వచ్చిన కూడా సెలక్టర్లు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తూనే ఉంటారు.

 ఇక వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి మాత్రం హార్దిక్ పాండ్య వరుసగా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా మొన్నటికి మొన్న జరిగిన టి20 వరల్డ్ కప్టోర్ టోర్నిలో కూడా టీమిండియా విజయాలలో కీలక పాత్ర వహించాడు. మరి ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ఏకంగా భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలి అనే నిరీక్షణకు తెరదించాడు . వరల్డ్ కప్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు తనపై వచ్చిన విమర్శలు అన్నింటికీ కూడా తన ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు..

 అలాంటి హార్దిక్  టీమ్ ఇండియాలో కేవలం పరిమిత ఓవర్లు ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతను టెస్ట్ మ్యాచ్ లు ఆడింది చాలా అరుదు. ఇక సెలక్టర్లు కూడా అతనికి టెస్ట్ ఫార్మాట్లో అసలు సెలెక్ట్ చేయరు. అయితే ఇదే విషయం గురించి మాట్లాడిన భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  టెస్ట్ ఫార్మాట్లో కూడా ఆడేలా హార్దిక్ పాండ్యాను ఒప్పించాలి అంటూ సూచించాడు. ఎలాంటి పిచ్ పైన అయినా కూడా రాణించగలిగే హార్దిక్ జట్టులో ఉంటే టెస్టుల్లో అజయులం అవుతాం అంటూ అభిప్రాయపడ్డాడు సునీల్ గవాస్కర్. రోజుకు అతను 10 నుంచి 15 ఓవర్లు వేస్తే ప్రత్యర్థి పై ఫైచేయి సాధించడం అంత కష్టమేమీ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. 2018లో టీమ్ ఇండియా తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన హార్దిక్ అప్పటి నుంచి ఇక ఆ ఫార్మాట్ కి దూరంగానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: