స్పిరిట్: ఓటిటితోనే సేఫ్.. విడుదలకు ముందే ఎన్ని కోట్లు లాభమంటే..?

Divya
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం స్పిరిట్. ఇందులో హీరోయిన్ గా త్రిప్తి దిమ్రి నటిస్తోంది. ఈ చిత్రం అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఈ సినిమాకి సంబంధించి న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి భారీ ఓటీటి డీల్ కుదిరినట్లుగా టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్ అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని భారీ ధరకే సొంతం చేసుకున్నట్లుగా సమాచారం.



సుమారుగా రూ.200 నుంచి రూ.250 కోట్ల రూపాయల వరకు ఈ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో నిర్మాతలకు స్పిరిట్ చిత్రం  టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా చేసిందనే విధంగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ప్రభాస్ ,డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రెమ్యూనరేషన్లను మినహాయిస్తే.. ఈ చిత్రానికి అయ్యే ఖర్చు కంటే నెట్ ఫ్లిక్ చెల్లించే ఓటీటి డీల్ చాలా ఎక్కువగా ఉన్నదట. దీంతో థియేట్రికల్ గా విడుదలైన తర్వాత వచ్చే ఆదాయం అదనపు లాభంగా ఉండనుంది. దీన్ని బట్టి చూస్తే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నిర్మాతలకు భారీ లాభాలను తీసుకురావడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


యానిమల్  సినిమా సక్సెస్ తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా ప్రభాస్ ఇందులో ఒక పోలీస్ అధికారిగా కనిపించడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. అందుకే నెట్ ఫ్లిక్ ఈ సినిమా ఓటిటి డీల్ కోసం వెనకడుగు వేయకుండా రికార్డు స్థాయిలో ధరను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి స్పిరిట్ సినిమా విడుదలై ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి మరి. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. దీంతో అభిమానులు నిరాశతో ఉన్నారు.2027 మార్చి 5 న విడుదల కాబోతున్న స్పిరిట్ సినిమాతో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: