రికార్డ్ సృష్టించిన టీమిండియా.. ఆ విషయంలో టీ20 లో ఇండియానే టాప్..!

Pulgam Srinivas
ప్రపంచం లోనే అత్యంత క్రేజ్ కలిగిన క్రికెట్ జట్లలో టీమిండియా ఒకటి. ఇక టీమిండియా జట్టు ఇటు టీ 20 , లోనూ 50 - 50 మ్యాచ్ లలోను , అలాగే టెస్ట్ క్రికెట్ లోనూ అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఈ మూడు ఫార్మేట్ లలో కూడా అత్యున్నత స్థానంలో కొనసాగుతూ వస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే టీ 20 వరల్డ్ కప్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో భారత జట్టు గెలుపొంది రెండవ సారి టీ 20 వరల్డ్ కప్పును కైవసం చేసుకుంది.

ఇక ఈ సిరీస్ లో ఎనిమిది మ్యాచ్ లను ఆడిన టీమిండియా 8 మ్యాచ్ లలో కూడా గెలుపొంది అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిచింది. ఇక ఇంత గొప్ప ఆట తీరును టీ 20 సిరీస్ లో కనబరిచిన ఇండియా జట్టు ప్రస్తుతం జింబాబ్వే తో టీ 20 సిరీస్ ఆడుతుంది. ఇకపోతే నిన్న భారత జట్టు జింబాబ్వే తో మూడవ టీ 20 మ్యాచ్ ఆడింది. ఇందులో భాగంగా ఇండియా జట్టు అద్భుతమైన ఆట తీరును కనబరిచి సూపర్ విక్టరీని సాధించింది. ఇక ఈ విజయంతో టీమిండియా జట్టు ఒక అద్భుతమైన రికార్డ్ ను నెలకొల్పింది.

ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ 20 లలో 150 విజయాలు సాధించిన తొలి జట్టు గా టీమిండియా రికార్డు సృష్టించింది. నిన్న జింబాబ్వే తో జరిగిన మూడవ టీ 20 మ్యాచ్ గెలుపుతో ఇండియాకు ఈ రికార్డు దక్కింది. ఇకపోతే భారత జట్టు తర్వాత పాకిస్తాన్ 142 మ్యాచ్ లు గెలిచి రెండవ స్థానంలోనూ , న్యూజిలాండ్ 111 మ్యాచ్ లను గెలిచి మూడవ స్థానంలోనూ ,  ఆస్ట్రేలియా 105 మ్యాచ్ లను గెలిచి నాలుగవ స్థానంలోనూ ,  సౌత్ ఆఫ్రికా 104 మ్యాచ్ లను గెలిచి 5 వ కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: