లాస్ట్ చాన్స్.. బాగా వాడేసుకున్న గిల్?
గిల్ కు మరో అవకాశం ఇస్తూ జింబాబ్వే టూర్‌కు సెలెక్ట్ చేశారు అక్కడ కూడా అతడు పేలవమైన పర్ఫామెన్స్ తో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. IPLలో అతని ప్రదర్శన కూడా వరస్ట్ గా ఉంది, 11 గేమ్‌లలో 147 స్ట్రైక్ రేట్‌తో 322 పరుగులు చేశాడు. ఈ ఫామ్ అతని జట్టు, గుజరాత్ టైటాన్స్ మాత్రమే కాకుండా, జాతీయ జట్టులో అతని కెరీర్ ని కూడా ప్రభావితం చేసింది.
అయితే, శుభ్‌మన్ గిల్ IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ సాధించాడు, ఫామ్‌లో ఉంటే అత్యున్నత స్థాయిలో ప్రదర్శన ఇవ్వగల సత్తా తనకు ఇంకా ఉందని అతడు ప్రూవ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోర్లైతే తాత్కాలికంగా మూయించగలిగాడు.
ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ అతనిని జింబాబ్వే టూర్‌లో ఉంచుకుంది, అతను తిరిగి ఫామ్‌ను పుంజుకుంటాడని ఆశించింది. కానీ ఇప్పుడు కూడా వరస్ట్ పర్ఫామెన్స్ చూపిస్తున్నాడు. ఇలాంటి బ్యాటింగ్ తో నిరాశపరిస్తే టీ 20 ఫార్మాట్ నుంచి అతడిని పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
టీ20 క్రికెట్‌లో గిల్ భవిష్యత్తు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. అతను తన సత్తాను నిరూపించుకోవడానికి, జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవడానికి రాబోయే మ్యాచ్‌లు కీలకం. ఈ టాలెంటెడ్ ప్లేయర్ కనుమరుగవుతారేమో అని ఫ్యాన్స్ చాలా ఆందోళన పడుతున్నారు. మరి గిల్ ఇప్పటికైనా తన ఆట తీరును పరిశీలించుకుని దానిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫాం సాధించడం అనేది ఇప్పుడు అతడి కెరీర్ కి అత్యవసరంగా మారింది. అయితే లాస్ట్ మ్యాచ్ లోకి అద్భుతంగా రానించాడు 49 బంతుల్లోనే 66 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక రకంగా అతని కెరియర్ ని సేఫ్ గా ఉంచేసుకున్నాడు అని చెప్పాలి.