అలా జరగకుంటే.. మేము ఫైనల్ లో ఓడిపోయేవాళ్ళం : రోహిత్

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీంలలో ఒకటిగా కొనసాగుతున్న ఎమ్మెల్యేకు గత కొంతకాలం నుంచి ప్రపంచకప్ ట్రోఫీ గెలవడం మాత్రం సాధ్యం కావట్లేదు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా అద్భుతంగా రానిస్తున్నప్పటికీ ఆ జట్టుకు మాత్రం అదృష్టం ఎక్కడ కలిసి రావడం లేదు. ఈ క్రమంలోనే ప్రతి వరల్డ్ కప్ లో కూడా బాగా రాణిస్తూ ముందుకు సాగుతున్న కీలకమైన మ్యాచులలో మాత్రం దురదృష్టం వెంటాడుతూ.. చివరికి జట్టు ఓటమిపాలు అవుతూ కప్పు గెలుచుకోకుండానే ఇంటికి చేరుతూ ఉంది.


 అయితే ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో మాత్రం అదరగొట్టేసింది టీమిండియా. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్రను కొనసాగించిన టీమిండియా.. ఏకంగా వరల్డ్ టైటిల్ ను ముద్దాడింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 140 కోట్ల మంది భారతీయుల కలను నెరవేర్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అటు సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ హైలెట్గా నిలిచింది. అతను క్యాచ్ పట్టకపోయి ఉంటే టీమ్ ఇండియా ఓడిపోయేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టిన తీరుపై అటు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ తోనే మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చింది అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం  నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశాడు   చేతిలో బంతి పడిందని సూర్య చెప్పాడు   ఒకవేళ అలా జరిగి ఉండకపోతే అతడిని పక్కన పెట్టేవాడిని అంటూ రోహిత్ మరాఠీలో కామెడీ చేయడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా నవ్వుకున్నారు. మరోవైపు రోహిత్ కారణంగానే ఈరోజు మహారాష్ట్ర నేతలందరూ ఒకటయ్యాము అంటూ డిప్యూటీ సీఎం పడ్నవిస్  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: