కోహ్లీ, రోహిత్ స్థానాలను.. భర్తీ చేసేది వీళ్లేనా?

praveen
ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా జైత్రయాత్రను కొనసాగించింది. చివరికి ఫైనల్ పోరులో సౌత్ ఆఫ్రికా ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  టీం ఇండియా పై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇలా ఒక్క ఓటమి కూడా లేకుండా వరల్డ్ కప్ లో టైటిల్ బీజేపీగా నిలవడం ఇదే మొదటిసారి కావడంతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టీమిండియా పేరు మారుమోగిపోతుంది అని చెప్పాలి..

 అయితే 2007లో ధోని కెప్టెన్సీలో t20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్లో ప్రపంచ కప్ ను ముద్దాడ గలిగింది అన్న విషయం తెలిసిందే. దీంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచిన శుభ సందర్భంలోనే టీమ్ ఇండియా ఫ్యాన్స్ అందరికీ కూడా అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 అయితే భారత జట్టులో ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్ల పాత్ర ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వీరి స్థానాలను భర్తీ చేయబోయే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే వీరి స్థానాలను యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్ భర్తీ చేస్తారని ఎంతోమంది నెటిజెన్స్ భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉంది అంటూ చెబుతున్నారు.  మరి రానున్న రోజుల్లో ఎవరు వీరి స్థానాన్ని భర్తీ చేస్తారని మీకు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: