వైఎస్సార్: అస్తమించిన సూరీడు! ఆంధ్రుల గుండెల్లో దేవుడు!

Purushottham Vinay

• వైఎస్సార్.. పేదల పాలిట దేవుడు!
 
• వైఎస్సార్.. ఆంధ్రులు మెచ్చిన నాయకుడు!
 
• వైఎస్సార్.. బడుగు బలహీన వర్గాలకు భగవంతుడు!
 
• వైఎస్సార్.. పథకాల్లో సరికొత్త విప్లవం తెచ్చిన మహానేత!

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనాలు మెచ్చిన నాయకుడు. పేద ప్రజల పాలిట దేవుడు. మొదట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 దాకా 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు.వై ఎస్ ని జనాలకు దగ్గర చేసింది పాదయాత్ర. 2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఈ పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో  వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

ఈ పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేసి జనాల్లో మహా నాయకుడు అయ్యారు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు. ఆయన పెట్టిన పథకాలతో పేదలు ఎలాంటి ఇబ్బందులు లేక బ్రతికారు. కిలో 2 రూపాయలకే బియ్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, ఉచిత విద్యుత్, ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలు పేదల కోసం పెట్టి దేవుడయ్యారు.సెప్టెంబర్ 2, 2009 న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటన కారణంగా వై ఎస్ మరణించారు. ఆయన మరణంతో యావత్ ఆంధ్రలోకం శోక సంధ్రంలో మునిగిపోయింది. ఆయన హఠాత్మరణాన్ని ఆంధ్రుల జీర్ణించుకోలేపోయారు. ఇప్పటికీ కూడా వై ఎస్ కోట్ల మంది ఆంధ్రుల గుండెల్లో దేవుడిలా గుడి కట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YSR

సంబంధిత వార్తలు: