సరిపోదా శనివారం : హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక అరుళ్  మోహన్ బర్త్డే సందర్భంగా సరిపోదా శనివారం మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసి ఆమెకు విషెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె రోల్ ఏంటో రివీల్ చేసింది.గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్  మోహన్. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నెమ్మదిగా తెలుగు ఆడియెన్స్ కీ దగ్గరైంది. అయితే తాజాగా నేచురల్ స్టార్ సరసన నటించేందుకు సిద్ధమైంది. 'సరిపోదా శనివారం'తో ఇక్కడి అభిమానులను మరోసారి పలకరించనుంది.అయితే అప్పట్లోనే ఈమె ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ఖరారైనప్పటికీ తన రోల్ గురించి మేకర్స్ ఎటువంటి హింట్ ఇవ్వలేదు. తాజాగా ప్రియాంక బర్త్డే సందర్భంగా ఆమె పాత్ర గురించి ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో చారుల‌త‌ అనే పేరు గల ఓ పోలీస్ కానిస్టేబుల్గా కనిపించనున్నారని తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రియాంక లుక్ను కూడా విడుదల చేశారు.నేచురల్ స్టార్ నాని, తమిళ క్యూట్ పొన్ను ప్రియాంకా అరుల్ మోహన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా 'సరిపోదా శనివారం'. ఈ రోజు హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమెకిది రెండో సినిమా. ఈరోజు, మేకర్స్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత అనే ఇన్నోసెంట్ పోలీసుగా కనిపించింది. ఆమె క్యారెక్టర్‌లో ఫిట్‌గా కనిపిస్తుంది. అందమైన చిరునవ్వు ఆకట్టుకుంది. ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. మురళి జి డీవోపీ కాగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం సరిపోదా శనివారం షూటింగ్ చివరి దశలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: