సౌతాఫ్రికాను భయపెడుతున్న.. సెమీస్ గండం?

praveen
ఎన్నో రోజులుగా ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఉత్కంఠ ఫలితంగా సాగుతూ వచ్చిన వరల్డ్ కప్ టోర్నీ ప్రస్తుతం సెమీ ఫైనల్ దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ టోర్ని ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎందుకంటే ఏకంగా ఛాంపియన్ టీమ్స్ చెత్త ప్రదర్శన చేసి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేసాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సెమీఫైనల్ లో భాగంగా నేడు రెండు మ్యాచ్లు జరగబోతున్నాయ్. ఈ రెండు మ్యాచ్లు పూర్తయ్యాక.. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఫైనలిస్టులు ఎవరు అనే విషయంపై పూర్తిస్థాయి క్లారిటీ రానుంది అని చెప్పాలి.

 కాగా ఇప్పటికే ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా టీమ్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగానే ఉత్కంఠ బరీతంగా సాగుతుంది అని చెప్పాలి. అయితే టి20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ లో అడుగు పెట్టలేదు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించాలని ఇరు జట్లు ఎంతో పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో తప్పక విజయం సాధించడమే లక్ష్యంగా పోరును కొనసాగిస్తున్నాయి అని చెప్పాలి. దీంతో ఇక మొదటి సెమి ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొనగా.. సౌత్ ఆఫ్రికాను మాత్రం సెమీఫైనల్ గండం వెంటాడుతోంది.

 ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో అరవీర భయంకరమైన టీం గా పేరున్న సౌత్ ఆఫ్రికా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరుకోలేదు. అయితే టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు రెండుసార్లు సెమీఫైనల్ కు చేరింది. కానీ రెండుసార్లు ఓడిపోయి ఇంటిబాట పట్టింది. 2009లో పాకిస్తాన్ ఫై, 2014లో ఇండియా పై ఓటమిపాలై టోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే ఇలా రెండుసార్లు సెమీస్ వరకు చేరి ఓడిపోయిన సౌత్ ఆఫ్రికాను ఇప్పుడు అదే సెమీస్ గండం వెంటాడుతుంది. కాగా నేడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ కు వెళితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే చిన్న టీం గా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణించిన ఆఫ్గానిస్తాన్ ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. దీంతో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని విషయంపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: