ఐపీఎల్ తో.. ఆటగాళ్లకు నష్టమా లాభమా?

praveen
దాదాపు నెలన్నర రోజులపాటు క్రికెట్ ప్రేక్షకులందరిని కూడా అలరిస్తూ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది. కోల్కతా నైట్ రైడర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 2024 ఐపీఎల్ సీజన్ కి విజేత ఎవరు అన్న విషయం తేలిపోయింది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ మ్యాచ్లో కూడా సన్రైజర్స్ ను ఓడించి మూడోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.

 అయితే ఐపీఎల్ షెడ్యూల్ ముగిసిందో లేదో అంతలోనే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు అందరు ఆటగాళ్లు బిజీ అయిపోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆటగాళ్లు ఐపిఎల్ లో భాగం అయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లను ఇక ఇప్పుడు మళ్లీ దేశం తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ నెలలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం ఇక ఇప్పటికే ప్రాక్టీస్ కూడా షురూ చేశారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అటు ఐపీఎల్ ఐపీఎల్ టోర్నీ నిర్వహించడం లాభమా నష్టమా అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే దాదాపు రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ లో ప్రపంచంలోనే అన్ని దేశాలు క్రికెటర్లు కూడా భాగం అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి ఐపీఎల్ వల్ల ప్లేయర్లకు లాభం నష్టమా అంటే లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆటగాళ్ల ప్రతిభ బయటపడుతూ ఉంటుంది  అంతేకాదు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ ఉపయోగపడుతుంది  ఇక ఒత్తిడిని జయించడం నేర్చుకోవచ్చు . ప్రపంచంలోనే దిగ్గజా క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకొని కొత్త అనుభవాన్ని సంపాదించుకోవడంలో ఉపయోగపడుతుంది. అలాగే నిర్విరామంగా క్రికెట్ ఆడటం, దేశ జట్టుకు ఆడడానికి ఇంట్రెస్ట్ కోల్పోవడం, ఇక ఎక్కువగా గాయాల పాలు కావడం లాంటి నష్టాలు కూడా జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: