పాకిస్తాన్ తో ఆడటం కంటే ఐపీఎల్ ఆడటమే బెటర్ : ఇంగ్లాండ్ మాజీ

praveen
ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ఆడుతూ బిజీబిజీగా ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడెందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో భాగం అయ్యే ఇక తమ జట్టును విశ్వవిజేతగా నిలిపేందుకు రెడీ అవుతున్నారు. ఇక మొన్నటి వరకు ఐపీఎల్ లో సంపాదించుకున్న అనుభవాన్ని మొత్తం టి20 వరల్డ్ కప్ లో ఉపయోగించుకోవాలి అనే ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నారు.

 కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసిన కూడా టి20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈసారి వరల్డ్ కప్ లో ఎవరు విజేతగా నిలవబోతున్నారు. ఏ చెట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం పైన అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఎప్పటిలాగానే తమ అంచనాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది మాజీ ప్లేయర్లు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోతున్నాయ్. ఇటీవల ఇంగ్లాండు మాజీ ప్లేయర్ పాకిస్తాన్ జట్టుతో జరగబోయే మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ తో కంటే ఐపీఎల్ ఆడటం ఎంతో బెటర్ అటు ఆ దేశ మాజీ క్రికెటర్ మైకల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో పొందిన అనుభవంతో టీ20 వరల్డ్ కప్ లో రాణించవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ను తక్కువగా అంచన వేయడం లేదని.. కానీ ఐపీఎల్ లో ఆడితే విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ లాంటి ఆటగాళ్లు మెరికల్ లా మారిపోతారు అంటూ అభిప్రాయపడ్డాడు. అక్కడ ఉండే ఒత్తిడి, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ యజమానులు, సోషల్ మీడియా ఇలా అన్నింటి నుంచి వారు ఎంతో కొంత నేర్చుకోవచ్చు అంటూ మైకేల్వాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: