"RR".. "RCB" ఈ సీజన్లో ఇద్దరిదీ ఒకే పరిస్థితి... కానీ కాస్త డిఫరెంట్ గా ..?

Pulgam Srinivas
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆప్స్ లోకి చేరిపోయింది. ఈ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను అడగా అందులో ఎనిమిది మ్యాచ్ లలో గెలుపొంది కేవలం ఐదు మ్యాచ్ లలో ఓడిపోయి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఇకపోతే నిన్న ఈ జట్టు కింగ్స్ 11 పంజాబ్ తో తరపడింది. నిన్న సాయంత్రం ప్రారంభం అయిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది.

145 పరుగుల స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన కింగ్స్ 11 పంజాబ్ జట్టు కేవలం 18.5 ఓవర్ లు ముగిసే సరికి కేవలం 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 145 పరుగులను చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ ప్రారంభం అయిన మొదటి దశలో అద్భుతమైన విజయాలను అందుకొని అందరి కంటే ముందు స్థాయిలో పాయింట్ల పట్టికలో నిలిచింది. కానీ వరుసగా ఈ జట్టు నిన్నటి మ్యాచ్ తో కలిసి నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.

నాలుగు మ్యాచ్ ల కంటే ముందే ప్లే ఆప్స్ కి కావాల్సిన పాయింట్లను సంపాదించుకున్న ఈ జట్టు ప్రస్తుతం మాత్రం వరుస అపజాయలను ఎదుర్కొంటుంది. ఇకపోతే బెంగళూరు జట్టు పరిస్థితి మరోరకంగా ఉంది. ఈ జట్టు మొదట వరస అపజాయలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో దారుణమైన స్థితిలో ఉంది. ఇక ఆఖరి ఐదు మ్యాచ్ లలో కూడా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరస విజాయలను అందుకొని ప్లే ఆప్స్ లోకి వెళ్లడానికి చూస్తోంది.

ఇలా రాజస్థాన్ రాయల్స్ అపజాయలను ఎదుర్కొంటూ ఉంటే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస విజయాలను అందుకుంటుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ తో ఓడిపోయిన తర్వాత ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేదు. ఇక బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్క మ్యాచ్ లో కూడా ఓడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: