సన్ రైజర్స్ హైదరాబాద్: ప్లే ఆఫ్స్ కి సూపర్ ఛాన్స్?

Purushottham Vinay
IPL దాదాపు ముగింపునకు వచ్చింది. 70 మ్యాచ్ ల ఈ దశ తర్వాత ప్లే ఆఫ్స్ అనేవి జరగనున్నాయి. మార్చి 22న స్టార్ట్ అయిన ఐపీఎల్-17కు మే 26న జరిగే ఫైనల్ తో ఎండ్ కార్డు పడనుంది.ఒక్కో జట్టు  మొత్తం 14 లీగ్ మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇప్పటి దాకా చూస్తే పది జట్లకు గాను నాలుగు జట్లు 11 మ్యాచ్ లు ఆడాయి. ఇక ఆరు జట్లు మొత్తం 12 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. మొదటి నుంచి అద్భుతంగా ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ లలో 8 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్తును  కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇప్పటి దాకా చెన్నై, గుజరాత్ మాత్రమే వీటితో సమానంగా 11 మ్యాచ్ లు ఆడాయి. శుక్రవారం ఈ రెండు జట్లూ కూడా తలపడనున్నాయి. అయితే, పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం మూడో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఇప్పటి దాకా 12 మ్యాచ్ లు ఆడి ఏడింటిలో గెలిచింది. బుధవారం సొంతగడ్డ ఉప్పల్ మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ టీంను చితక్కొట్టి పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకెళ్లింది. అయితే రన్ రేట్ ప్రకారం చూసుకుంటే చెన్నై (0.700) కంటే సన్ రైజర్స్ (0.406) వెనుకనే ఉంది. కానీ, 14 పాయింట్లతో ఏకంగా మూడో స్థానంలో నిలిచింది.


ఒకవేళ గుజరాత్ పై చెన్నై గనుక గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో ప్లేస్ కు దిగుతుంది.ఈ సీజన్ లో హైదరాబాద్ రికార్డు స్కోర్లు  (ఉప్పల్ లో ముంబై పై 277, బెంగళూరులో బెంగళూరుపై (287) చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు లక్నోపై అయితే 58 బంతుల్లోనే 166 పరుగుల లక్ష్యాన్ని కొట్టేసింది. దీంతో రన్ రేట్ పరంగా కూడా కొంచెం మెరుగ్గా ఉంది. కాగా, హైదరాబాద్ విజయాల్లో అత్యధికంగా సొంతగడ్డపై సాధించనవే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ కు సన్ రైజర్స్ కు ఈజీ చాన్స్ లభించింది.ఇక 7 మ్యాచ్ లలో గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ మిగతా రెండు మ్యాచ్ లను ఉప్పల్ లోనే ఆడనుంది.ఈ నెల 16న గుజరాత్ టైటాన్స్ తో, 19న పంజాబ్ కింగ్స్ తో హైదరాబాద్ తలపడనుంది. ప్రస్తుత లీగ్ లో గుజరాత్, పంజాబ్ కాస్త బలహీనంగా ఉన్నాయి. అందులోనూ సొంతగడ్డపై ఆడుతున్న హైదరాబాద్ ను ఈ రెండూ ఓడించడం కష్టమే. ఈ నేపథ్యంలోనే రెండు మ్యాచ్ లలో కూడా గెలిచేందుకు సన్ రైజర్స్ కు మంచి చాన్స్ దక్కింది.అవి కూడా 18 పాయింట్లతో మిగతా జట్ల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: