వరల్డ్ కప్ కు ఉగ్రవాద హెచ్చరికలు.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు?

praveen
మరికొన్ని రోజుల్లో అమెరికా వెస్టిండీస్ వేదికలుగా t20 వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో అన్ని టీమ్స్ కూడా అలర్ట్ అయిపోయాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విధించిన డెడ్లైన్ ప్రకారం వరల్డ్ కప్ ఆడబోయే జట్టు సభ్యుల వివరాలను అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. జూన్ రెండవ తేదీ నుంచి ఈ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది. అయితే మ్యాచ్లకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా నిర్వహించేందుకు.. ఇప్పటికే ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పాలి.

 మొత్తంగా ఈ ప్రపంచ కప్ టోర్నీలో 20 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. కాగా ఇప్పటికే అటు బీసీసీఐ కూడా వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది అని చెప్పాలి  అయితే ఇక వరల్డ్ కప్ నిర్వహించడం కోసం అన్ని సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఏకంగా టి20 వరల్డ్ కప్ కు ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు రావడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందో అని అందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. అయితే ఇదే విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు.

 వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కు ఉగ్రవాద హెచ్చరికలు రావడం పై  కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన.  వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న దేశాల భద్రత ఏజెన్సీలు ఇలా ఉగ్రవాద హెచ్చరికలపై దృష్టి సారిస్తాయి. అన్ని మ్యాచ్లకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారి పైన ఉంది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత విషయంలో మేము అవసరమైన చర్యలు తీసుకుంటాము అంటూ రాజీవ్ శుక్ల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇలా ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ఇక వరల్డ్ కప్ మ్యాచ్లు జరగబోయే స్టేడియంలో దగ్గర ఆయా దేశాల క్రికెట్ బోర్డులు, భద్రత ఏజెన్సీలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: