అరుదైన రికార్డ్.. గేల్ తర్వాత డూప్లెసిస్సే?

praveen
ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ ఇక టైటిల్ పోరులో వెనకబడి పోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. 2024 ఐపీఎల్ సీజన్ లో కూడా ఇదే రిపీట్ చేసింది. ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల ఆర్సిబి జట్టు టైటిల్ గెలిచినట్లుగానే అటు ఐపీఎల్ లో కూడా పురుషుల ఆర్సిబి జట్టు తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మరోసారి ఆర్సిబిటీ నిరాశపరిచింది.

 ఏకంగా వరుస ఓటములతో సతమతమవుతూ అభిమానులు అందరిని కూడా నిరాశలో ముంచేసింది అని చెప్పాలి. ఇక ఇప్పటికే అత్యధిక ఓటములతో ప్లే ఆఫ్ లో చేరే అవకాశాలు కూడా దాదాపు కోల్పోయింది బెంగళూరు టీం. అయితే గత కొంతకాలం నుంచి వరుసగా ఓటములతో సుతమతమవుతున్న ఆర్సీబీ జట్టుకు చాలా రోజుల తర్వాత మరో విజయం లభించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. గుజరాత్ జట్టు తమ ముందు ఉంచిన 147 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించింది అని చెప్పాలి.

 అయితే ఇలా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో డూప్లెసిస్ సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. ఐపీఎల్  హిస్టరీలో ఆర్సిబి జట్టు తరఫున ఇది రెండో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ కావడం విశేషం. అయితే 2013లో పూనే వారియర్స్ పై గేల్ 17 బంతుల్లోనే అర్థ సెంచరీ చేయగా.. 2010లో పంజాబ్ కింగ్స్ ఫై రాబిన్ ఊతప్ప  19 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవలే డూప్లెసెస్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. మొత్తంగా 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు  ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: