నేను ఆ మాట అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రాయుడు?

praveen
2024 ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పరవాలేదు అనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇక కొత్త కెప్టెన్ ఋతురాజు  సారధ్యంలో ఆ జట్టు బరిలోకి దిగుతుంది. అయితే ధోని పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించకుండా జట్టులో కీలక ఆటగాడుగా కొనసాగుతూ ఉండడంతో ఇక ధోని ఆధ్వర్యంలో ఋతురాజ్ తన కెప్టెన్సీ తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.

 కాగా ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు విజయాలు సాధించి.. పాయింట్ల    పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉంది. అయితే ధోని కూడా అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే లక్నోతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. దీంతో అటు రుతురాజ్  గైక్వాడ్ కెప్టెన్సీ పై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇదే విషయంపై ఒక చర్చ కూడా జరిగింది. గెలిస్తేనేమో ధోని వల్లే గెలిచింది అంటారు. ఓడిపోతే రుతురాజు ను నిందిస్తారా అంటూ నెటిజెన్స్ చర్చించటం కూడా మొదలుపెట్టారు.

 అయితే లక్నో చేతిలో సీఎస్కే ఓటమికి కెప్టెన్ రుతురాజు వైఫల్యమే కారణమని అంబటి రాయుడు కూడా కామెంట్ చేశాడు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అటు  రాయుడు స్పందించాడు. ఆరోజు నేను కామెంటరీ చేయలేదు. నా తోటలో మామిడి పండ్లు కోస్తున్న. ఏదైనా రాసేటప్పుడు ముందు వెనక ఆలోచించండి. బాధ్యతగా వ్యవహరించండి. ఇలాంటివి వ్యాప్తి చేయకండి అంటూ కామెంట్ చేశాడు అంబటి రాయుడు. అయితే ఓటమికి రుతురాజు వైఫల్యమే కారణం అంటూ రాయుడు కామెంట్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో క్రెడిట్ ధోని..  బ్లేమ్ ఋతురాజ్ అంటూ మాజీ ప్లేయర్ నవజ్యోతి సింగ్ సిద్ధూ  రాయుడికి కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: