ధోనికి షాక్.. ఆ రికార్డు బ్రేక్ చేసిన జడేజా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గా ఇక వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా ధోనీకి గుర్తింపు ఉంది. అంతేకాదు మిస్టర్ కూల్ కెప్టెన్ అని ఇక కోట్లాదిమంది క్రికెట్ ప్రేక్షకులు ధోని కి అభిమానులుగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే 2019 అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటర్మెంట్ ప్రకటించిన మహేందర్ సింగ్ ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ తన ఆటతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

 అయితే దాదాపు 17 ఏళ్ళ ఐపీఎల్ హిస్టరీలో ప్రతి సీజన్లో కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు తరఫున ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనిని మించిన రికార్డులు సాధించిన ఆటగాడు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇటీవలే అదే జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా మహేంద్రసింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

 ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన రవీంద్ర జడేజా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుతో ఇక ధోని రికార్డును బ్రేక్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ అవార్డులు (16) అందుకున్న ప్లేయర్గా నిలిచాడు జడేజా. ఇక వరకు ఆ చెట్టు మాజీ కెప్టెన్ ధోని (15) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక ఇప్పుడు జడేజా ఈ రికార్డును బ్రేక్ చేశాడు. తర్వాత స్థానాల్లో రైనా 12, గైక్వాడ్ 11, హస్సి పది సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: