క్రికెట్లో విషాదం.. బంతి అక్కడ తగలడంతో ప్రాణం పోయింది?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే అంతా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో.. ఎన్నో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను హరిస్తూ ఉంటాయి  అప్పుడు వరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న చిన్నారులు సైతం ఇక ఒక్కసారిగా మృత్యువు ఒడిలోకి చేరే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ మధ్యకాలంలో మాత్రం ఎంతోమంది అభం శుభం తెలియని చిన్నారులు.. సడన్ హార్ట్ ఎటాక్లతో చూస్తుండగానే కుప్పు కూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘాటనే జరిగింది. కానీ సడన్ హార్ట్ ఎటాక్ కాదు ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా క్రికెట్ హడావిడి కొనసాగుతుంది. ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు బ్యాటు బాలు పట్టుకొని మైదానంలోకి వెళ్లి క్రికెట్ ఆడటం చేస్తూ ఉన్నారు అని చెప్పాలీ. దీంతో ఎక్కడ చూసినా ఇలా క్రికెట్ మేనియా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక బాలుడు కూడా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు.

 కానీ ఆ క్షణమే ఆ బాలుడి జీవితంలో చివరి క్షణం అవుతుంది అని మాత్రం అస్సలు ఊహించలేకపోయాడు. ఏకంగా బంతి తగలరాని  చోట తగిలి బాలుడు మృతి చెందిన ఘటన పూణేలో వెలుగులోకి వచ్చింది. శౌర్య కాళిదాసు అనే పదకొండేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి స్పోర్ట్స్ అకాడమీలో క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆట మధ్యలో బంతి అతని ప్రైవేట్ పార్ట్ కి తగిలింది. దాంతో నొప్పితో విలవిలలాడిపోయిన అతను మైదానంలోనే కుప్పకూలిపోయాడు  అయితే అక్కడే ఉన్న స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే శౌర్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  ఈ ఘటనతో శౌర్య తల్లిదండ్రులు అరణ్య రోదనగా  విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: